సీఎం రేవంత్ పై హరీశ్ రావు ఫైర్
NEWS Apr 09,2025 04:19 pm
మాజీ మంత్రి హరీశ్ రావు షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ తెలంగాణను నిలబెడితే రేవంత్‌రెడ్డి పడగొట్టే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు. దేశం సగటులో జీఎస్టీ తగ్గిందంటే దానికి కారణం రేవంత్‌రెడ్డేనని పేర్కొన్నారు. కేసీఆర్ చెట్టు పెడితే.. రేవంత్ నరుకుతా అంటున్నాడని, HCUలో అడవులు నరికిన రేవంత్‌కి మూగజీవాల ఉసురు తగులుతుందన్నారు. కేసీఆర్‌ది సాగు భాష అయితే రేవంత్ రెడ్డిది చావు భాష అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.