డీసీసీ అధ్యక్షులకే ఫుల్ పవర్స్
NEWS Apr 09,2025 04:15 pm
ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. అహ్మదాబాద్ వేదికగా జరిగిన విస్తృత సమావేశంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి దేశ వ్యాప్తంగా పార్టీ పరంగా ఆయా జిల్లాలకు సంబంధించి జిల్లా అధ్యక్షులుగా ఉన్న వారికి ఫుల్ పవర్స్ ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. అభ్యర్థుల ఎంపికలో కూడా డీసీసీ చీఫ్ లదే అంతిమ నిర్ణయమని పేర్కొంది. డీసీసీ అధ్యక్షుల నిర్ణయమే AICC నిర్ణయంగా ప్రకటించిన పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే.