జగన్ కామెంట్స్ పై పోలీసుల కన్నెర్ర
NEWS Apr 09,2025 02:33 pm
పోలీసుల బట్టలు ఊడదీస్తామంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు మాజీ సీఎం జగన్ రెడ్డి. ఆయన చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు కన్నెర్ర చేశారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఒక బాధ్యత కలిగిన పదవిలో ఉన్న జగన్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. దీనిపై న్యాయ పోరాటం చేస్తామని అన్నారు ఏపీ పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు జనకుల శ్రీనివాస్.