రామ్ గోపాల్ వర్మపై మరో ఫిర్యాదు
NEWS Apr 09,2025 02:24 pm
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు బిగ్ షాక్ తగిలింది. మత ఉగ్రవాద చర్యలను వర్మ ప్రేరేపిస్తున్నాడని ఆరోపిస్తూ ఫిర్యాదు చేశారు రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక ప్రెసిడెంట్ మేడా శ్రీనివాస్ సారథ్యంలో బుధవారం రాజమండ్రి 3వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న వర్మపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. తనను అరెస్ట్ చేయొద్దంటూ హైకోర్టును ఆశ్రయించారు వర్మ.