ప్రయాగ్ రాజ్ లో కొనసాగుతున్న మహా కుంభ మేళాలో పూసలు అమ్ముకుంటూ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది మోనాలిసా. ఊహించని రీతిలో ఆమెకు సినిమాలో ఛాన్స్ దక్కింది. బాలీవుడ్ కు చెందిన డైరెక్టర్ సనోజ్ మిశ్రా ది డైరీ ఆఫ్ మణిపూర్ పేరుతో మూవీ చేయనున్నాడు. ఇందులో మోనాలిసా కీ రోల్ పోషించనున్నారు. ఈ మేరకు డైరెక్టర్ మోనాలిసా ఇంటికి వెళ్లి సినిమాలో నటించేందుకు సంతకం చేయించుకున్నాడు.