ఎటువంటి లైసెన్స్ లేకుండా వైద్య వృత్తిని నిర్వహిస్తున్న పీఎంపీ హరి కృష్ణ చారి అనే వ్యక్తిని బుధవారం అరెస్ట్ చేసినట్లు నిజామాబాద్ ఏసీపీ రాజా వెంకట్ రెడ్డి తెలిపారు. అతని వద్ద నుండి ప్రథమ చికత్స కిట్, మందులు, స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. విచారణలో ముప్కాల్ మండలంలోని రెంజర్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించామని, తను నకిలీ డాక్టర్ గా అవతారం ఎత్తారని వెల్లడించారు ఏసీపీ.