మంత్రి నారా లోకేష్ కు డిప్యూటీ సీఎం ఇవ్వాలనే డిమాండ్ పై తీవ్రంగా స్పందించారు ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. ఇది మంచి పద్దతి కాదంటూ టీడీపీ మంత్రులు, నేతలకు హితవు పలికారు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారని, ఈ సమయంలో ఇంకొకరికి ఎలా ఇస్తారంటూ ప్రశ్నించారు. అయితే పార్టీ బలోపేతం కోసం నారా లోకేష్ తీవ్రంగా శ్రమించిన మాట కాదనలేమన్నారు. అందుకే సీఎం చంద్రబాబు తనకు కేబినెట్ లో చోటు కల్పించారని చెప్పారు.