అమెరికా నూతన అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ కు ఫోన్ చేశారు ప్రధాని మోడీ. రెండోసారి ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సఖ్యత, ప్రపంచ శాంతి, భద్రతల దృష్ట్యా కలిసికట్టుగా పని చేద్దామని పిలుపునిచ్చారు. తనకు అత్యంత ఆత్మీయమైన దేశాధినేతలలో ట్రంప్ ఒకరని పేర్కొన్నారు. ఈ సందర్బంగా మోడీకి ధన్యవాదాలు తెలిపారు ట్రంప్.