చిన్నారికి నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ మెడల్
NEWS Dec 12,2024 06:55 am
కోరుట్ల పట్టణానికి చెందిన 5 నెలల చిన్నారి శీలం శ్రీకృతి అరుదైన రికార్డు సాధించింది. 5 నెలల వయసులోనే ఫ్లాష్ కార్డులను ఆల్ఫాబెట్స్, పక్షులు, జంతువులు, పండ్లను అలవోకగా గుర్తిస్తుంది. అతి చిన్న వయసులో ఫ్లాష్ కార్డులను గుర్తు పట్టడంతో చిన్నారిని నోబుల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ వరించింది. విషయం తెలుసుకున్న జగిత్యాల కలెక్టర్ సత్యప్రసాద్ వారి ఛాంబర్లో చిన్నారి తల్లిదండ్రులను పావని వంశీని అభినందించారు.