సిద్దారెడ్డి నిర్ణయం కేటీఆర్ హర్షం
NEWS Dec 12,2024 06:29 am
తెలంగాణ తల్లి రూపు రేఖలను మార్చడం, సంస్కృతిని నిర్వీర్యం చేస్తున్నందుకు నిరసనగా తెలంగాణ సర్కార్ సన్మానాన్ని తిరస్కరించిన ప్రముఖ కవి నందిని సిద్దారెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు మాజీ మంత్రి కేటీఆర్. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడినందుకు ధన్యవాదాలు తెలియ చేశారు. కవులు, కళాకారులు, రచయితలు వ్యక్తిత్వ, చరిత్ర హననాన్ని వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.