తెలంగాణ తల్లి అంటే దొరసానిలా కాదు
NEWS Dec 11,2024 04:03 pm
తెలంగాణ పదాన్ని ఉచ్చరించే అర్హత బీఆర్ఎస్ నాయకులకు లేదని కామారెడ్డి జిల్లా పరిషత్ మాజీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహన్ రెడ్డి తెలిపారు. దొరల దొరసాన్ని తీసుకొచ్చి తెలంగాణ తల్లి అంటే ఎలా సాగుతుందని, తెలంగాణకు నిలువెత్తు నిదర్శనంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు. చాకలి ఐలమ్మ, సమ్మక్క సారలమ్మ ప్రతిరూపమే నేటి తెలంగాణ తల్లి విగ్రహం అన్నారు.