మల్లాపూర్: నూతన ప్రెస్ క్లబ్ కార్యాలయం ప్రారంభం
NEWS Dec 11,2024 08:51 am
మల్లాపూర్ మండల కేంద్రంలో నూతన ప్రెస్ క్లబ్ ( TUWJ- H-143 ) అధ్యక్షుడు ముత్యాల రమేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని రాష్ట్ర అధ్యక్షులు గంగుల రాంగోపాల్ ప్రారంభించారు. వారితో పాటు జిల్లా అధ్యక్షులు శికారి రామకృష్ణ, కోరుట్ల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ముక్కెర చంద్రశేఖర్ ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు, ప్రెస్ క్లబ్ కార్యవర్గం, మండల స్థాయి అధికారులు, వివిధ పార్టీల అధ్యక్షులు, పలు గ్రామాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.