హైటెన్షన్ వైర్ కింద 83 ఫీట్ల రోడ్డుకు అంగీకారం
NEWS Dec 11,2024 08:52 am
కామారెడ్డి పట్టణంలోని సబ్ స్టేషన్ నుండి లింగపూర్ శివారులోని బృందావన్ గార్డెన్ వరకు, దేవునిపల్లి-లింగాపూర్ శివారులో లే అవుట్లు చేస్తున్న భూ యజమానులు గిఫ్ట్ డిడ్ చేస్తు కలెక్టర్ కు వినతి పత్రం అందించారు. హై టెన్షన్ వైర్ కింద 83 ఫీట్ల రోడ్డు వేయటానికి తమ భూములు మున్సిపల్ కి గిఫ్ట్ డీడ్ చేయానికి అంగీకారం తెలుపుతున్నామని వెల్లడించారు. హై టెన్షన్ విద్యుత్ తీగలు ఉన్నందున 83 ఫీ రోడ్డు వేయాలని గతంలో కామారెడ్డి ఎమ్మెల్యే కోరడంతో అందరి అవసరాలకు అంగీకారం తెలుపుతూ నిర్ణయం తీసుకున్నారు.