సంచార జాతుల కోటాకు ఉద్యమం
NEWS Dec 10,2024 05:59 pm
సంచార జాతులకు రాజకీయ అవకాశం లేకుండా ఉందని, రాజ్యాంగంలో వీరికి రిజర్వేషన్స్ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర సంచార రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్ తిపిరిశెట్టి మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సింగజోగి శ్రీనివాస్డిమాండ్ చేశారు. నిజామాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించడంలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పార్టీలు తమను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచార జాతి కులాలు బిసిల్లో 52 ఎస్సిల్లో 10 ఎస్టీ ల్లో 4 కులాలు ఉన్నారన్నారు.