టీ-బీజేపీ రాష్ట్ర చీఫ్ రేసులో అర్వింద్?
NEWS Dec 10,2024 06:14 pm
తెలంగాణ బీజేపీ రాష్ట్ర చీఫ్ రేసులో పలువురు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్, ధర్మపురి అరవింద్, బండి సంజయ్, డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు రేసులో ఉన్నారని చెబుతున్నారు. వీరిలో బీసీ నేతకు రాష్ట్ర చీఫ్ పదవి దక్కే చాన్స్ ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. వీరిలో ధర్మపురి అరవింద్- ఈటెల రాజేందర్ మధ్య రసవత్తర పోరు నడుస్తోందట.. మరోవైపు కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా తనకు మరో చాన్స్ ఇవ్వాలని కోరుతున్నారట.