ఘనంగా సోనియా పుట్టినరోజు వేడుకలు
NEWS Dec 09,2024 03:11 pm
కోరుట్ల:- వెంకటాపూర్ గ్రామంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీ చేసిన సేవలను కొనియాడారు. యూత్ కాంగ్రెస్ కార్యవర్గాన్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు చిట్టిబాబు, నబి, రవీందర్ రెడ్డి, నరసయ్య, రాజేందర్, గంగాధర్, మహ్మద్ నసీర్, రమేష్, మధు తదితరులున్నారు.