ఘనంగా సోనియా పుట్టినరోజు వేడుకలు
NEWS Dec 09,2024 12:49 pm
మెట్‌పల్లి పట్టణంలో టీపీసీసీ డెలిగేట్ కల్వకుంట్ల సుజిత్ రావు ఆదేశాల మేరకు సోనియా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి స్వీట్‌లు తినిపించుకున్నారు. సోనియమ్మ ఇలానే ఆరోగ్యంగా, ప్రజాసేవలో ఎల్లవేళలా ఉండాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మెట్‌పల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ కూన గోవర్ధన్, మెట్‌పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు ఖుతుబ్ పాషా, మెట్‌పల్లి మండల ఫిషర్మాన్ అధ్యక్షులు రాజు, జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందె మారుతి పాల్గొన్నారు.