అల్లు అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలి
NEWS Dec 09,2024 01:00 pm
అభిమాని ప్రాణాన్ని బలిగొన్న అల్లు అర్జున్ ను వెంటనే అరెస్టు చేయాలని నిజామాబాద్ పిడిఎస్ యూ అధ్యక్షుల రాజేశ్వర్ అన్నారు. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా అల్లు అర్జున్ బాధ్యతారహిత్యంతో రేవతి అనే మహిళ చనిపోవడంతో పాటు, తన కొడుకు చావు బతుకుల్లో హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నాడు. పెద్ద ఎత్తున అభిమానులు ప్రీమియర్ షో కు వచ్చినప్పుడు బాధ్యతగా వ్యవహరించాల్సిన అల్లు అర్జున్ దానికి భిన్నంగా వ్యవహరించి షో కి వచ్చాడు. తొక్కిసలాటలో ఒక నిండు ప్రాణం పోయిందన్నారు.