తిరుమలలో అన్యమత గుర్తు, పేరు కలిగిన వస్తువును విక్రయించిన దుకాణాన్ని టీటీడీ ఎస్టేట్ అధికారులు తాత్కలికంగా సీజ్ చేశారు. హైదరాబాద్ కి చెందిన శ్రీధర్ శ్రీవారిని దర్శించుకున్నారు. ఎస్ ఎన్ సి షెడ్ లో షాప్ నెంబర్ 3లో స్టీల్ కడియం కొనుగోలు చేశాడు. దాని మీద అన్యమత పేరు, గుర్తు కలిగి ఉండడంతో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన సేఫ్టీ ఆఫీసర్స్ షాప్ ను మూసి వేశారు.