రౌతులపూడిలో రేపు మండల సర్వ సభ్య సమావేశం
NEWS Aug 27,2024 05:15 am
రౌతులపూడి మండల పరిషత్ కార్యాలయంలో బుధవారం మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీఓ ఎం.ప్రేమ్ సాగర్ తెలిపారు. ఎంపీపీ గంటిమళ్ల రాజ్యలక్ష్మి అధ్యక్షతన ఉదయం 10.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశంలో మండలాభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై చర్చిస్తారన్నారు. ఎంపీటీసీలు, సర్పంచులు, అన్ని శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని ఆయన కోరారు.