రాయవరం లో మద్యం అమ్ముతున్న వ్యక్తి అరెస్టు
NEWS Aug 27,2024 06:19 am
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం రాయవరం గ్రామంలో ఓ పాన్ షాప్ లో అక్రమంగా మద్యం అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు సోమవారం సాయంత్రం జగ్గంపేట ఎస్సై టి. రఘునాధరావు తన సిబ్బందితో దాడి చేశారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న షాప్ యజమాని మాదాసు సత్యనారాయణ ను అదుపు లోకి తీసుకుని 11 క్వార్టర్స్ బాటిల్స్ స్వాధీనం చేసుకుని, అతనిపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై తెలిపారు.