గంజాయి సేవిస్తున్న వ్యక్తి అరెస్ట్
NEWS Aug 27,2024 01:27 am
జైనథ్ మండలం పిప్పర్వాడ టోల్ ఫ్లాజా సమీపంలోని హైవే క్యాంటీన్ పక్కన గల మూత్రశాల వద్ద నాగపూర్కు చెందిన అఫ్సర్ ఖాన్ గంజాయి సేవిస్తూ ఉండగా పెట్రోలింగ్ నిర్వహిస్తున్న జైనథ్ ఎస్ఐ, సిబ్బంది పట్టుకున్నారు.అఫ్సర్ ఖాన్ వద్ద ఉన్న బ్యాగ్ను తనిఖీ చేసి 46 గ్రాముల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ గంజాయిని నాగపూర్లోని అశ్వక్ అనే వ్యక్తి వద్ద కొనుగోలు చేసి ఆదిలాబాద్ రైల్వే స్టేషన్ వద్ద గంజాయి సేవించే వారికి చిన్న చిన్న ప్యాకెట్లలో అమ్ముతున్నట్లు విచారణలో తేలిందని ఎస్ఐ పురుషోత్తం తెలిపారు.